సమాజంలో మనుషులులో ఉండాల్సిన మానవత్వం రోజురోజుకు దిగజారిపోతుంది. సాటి మనుషుల పట్ల మూగజీవాల పట్ల ఎంతో ఉదార స్వభావాన్ని చాటు కోవాల్సిన మనుషులు రోజురోజుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక, హసన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నోరులేని 50 కోతులకు ఆహారంలో విషమిచ్చి చంపిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
కర్ణాటక, హసన్ జిల్లాలో చౌడనహళ్లి సమీపంలోని ఓ రోడ్డు సమీపంలోని గ్రామస్తులు ఒక గోనెసంచి పడి ఉండటం గమనించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వెళ్లి ఆ గోనె సంచిని తెరిచి చూడగా అందులో కోతులు విగతజీవులుగా కనిపించాయి. ఈ క్రమంలోనే గ్రామస్తులు వాటిని బయటికి తీయడంతో సుమారు 50 కోతులు ఒకే సంచిలో ఉండటం వల్ల ఊపిరాడక వీటిలో 38 కోతులు ప్రాణాలను కోల్పోయాయి. మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు చనిపోయిన కోతులను పోస్టుమార్టానికి తరలించారు దీంతో వాటిపై విష ప్రయోగం జరగడం వల్ల చనిపోయాయని గుర్తించారు. అదేవిధంగా వాటిని ఒక సంచిలో వేసి ఘోరంగా కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నటువంటి బేలూర్, సక్లేష్ పూర్‌లో చాలా కోతులున్నా వాటికి వచ్చే నష్టమేమీ కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.అయితే ఈ ప్రాంతంలో చనిపోయిన కోతులు ఈ ప్రాంతానికి చెందినవి కాదని, ఎక్కడో చనిపోవటం వల్ల తీసుకువచ్చి ఇక్కడ వేసి ఉంటారని అధికారులు భావించారు.ప్రస్తుతం కోతులకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెలియడంతో పలువురు జంతు ప్రేమికులు నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…