Lanke Bindelu: లంకె బిందెలు.. వీటి గురించి అందరికీ తెలుసు. రెండు లోహాలతో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా వజ్రాలు, రత్నాలు లేదా ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. వీటిని పాతిపెడితే మళ్లీ ఎప్పుడో ఎవరికో లభిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం లంకె బిందెలు దొరికిన వార్తలను కూడా చదువుతుంటాం. అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయకూడదని, అరిష్టమని, వాటిని తీస్తే రక్తం నోట్లో నుంచి వచ్చి చనిపోతారని కొందరు చెబుతుంటారు. అయితే ఇది నిజమేనా ? అంటే..
లంకె బిందెలను సహజంగానే రాగి, ఇత్తడి వంటి లోహాలతో తయారు చేస్తారు. ఇక వాటిల్లో ఉండే ఆభరణాలు కూడా లోహాలే. కనుక అవి ఎక్కువ కాలం పాటు ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఆ ప్రభావం వల్ల రంగు మారుతుంటాయి. ఇక భూమిలో అవి ఉంటే వాటికి గాలి సోకే మార్గం ఉండదు. దీంతో అవి క్షయానికి గురై వాటి నుంచి గాలి బయటికి పోక అక్కడే ఉంటుంది.
ఈ క్రమంలో అలాంటి లంకె బిందెలను తీసినప్పుడు ఒక్కసారిగా ఘాటైన వాసనలు వస్తాయి. అవి ఒక్కోసారి విషపూరితంగా ఉంటాయి. కొన్ని సార్లు ఉండవు. ఆ వాసనలు కొందరికి పడవు. దీంతో వాటిని పీల్చగానే ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, వాంతికి రావడం, నోరు, ముక్కుల్లోంచి రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అందరిలోనూ కనిపించాలని ఏమీ లేదు. వాసనలు పడకపోతే అలా జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో లంకె బిందెలను తీస్తే ఎవరికైనా అలా జరిగితే నిజంగానే ఆ బిందెలను తీయడం వల్ల అరిష్టం కలిగిందేమోనని భావిస్తుంటారు. కానీ నిజానికి అది అరిష్టం కాదు.
ఎన్నో సంవత్సరాలుగా ఆ బిందెలు భూమి లోపల ఉంటే అవి క్షయానికి గురై అక్కడ విష వాయువులు నిండిపోతాయి. అవి ఒక్కసారిగా బయటకు వస్తే వాటిని వాసన పీలిస్తే అలా జరుగుతుంది. అంతేకానీ.. ఆ బిందెలను తీయడం వల్ల ఎలాంటి అరిష్టం ఉండదు. కాకపోతే ఎవరికైనా అలా బిందెలు దొరికితే వాటిని తీసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ముక్కుకు ఏదైనా అడ్డు పెట్టుకుని తీస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల లంకె బిందెలను తీయడం వల్ల ఎలాంటి అరిష్టం రాదని తెలుసుకోవాలి. దాని వెనుక పైన తెలిపిన కారణాలు ఉంటాయి కనుకనే చాలా మందికి అలా జరుగుతుంటుంది.
ఇక కొన్ని సార్లు లంకె బిందెలు దొరికాయన్న ఆనందంతో కొందరికి బీపీ ఎక్కువగా పెరిగిపోతుంది. దీని వల్ల సహజంగానే మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం బయటకు వచ్చి చనిపోతారు. అలాగే కొందరికి ఆనందం పట్టలేక హార్ట్ ఎటాక్ వస్తుంది. కానీ ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…