దారుణం: ఒకే గ్రామంలో 28 మంది మృతి.. అష్ట దిగ్బంధనం చేసిన అధికారులు..!

May 7, 2021 9:18 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు సంభవించాయి. తాజాగా హర్యానా జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలో ఏకంగా 28 మరణాలు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టిటోలి గ్రామంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గ్రామాన్ని దిగ్భందం చేసింది.

అయితే ఈ గ్రామంలో మరణించిన 28 మంది కరోనా వైరస్ బారినపడి మరణించినట్లు అధికారులు గుర్తించారు.వీరందరూ చనిపోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఎంతో జ్వరంతో బాధ పడుతూ మృతి చెందినట్లు భావించారు. గ్రామంలోని 28 మంది మహమ్మారి బారిన పడి చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై గ్రామాన్ని కట్టుదిట్టం చేశారు.

కరోనా వైరస్ ఈ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం పోలీసులు గ్రామాన్నే కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎవరూ కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా, ఇతర గ్రామస్తులు లోపలికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment