India Vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ భారత్.. వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు తడబడింది. దీంతో ఆ జట్టు మళ్లీ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో విండీస్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్ 111 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసి ఆకట్టుకోగా రిషబ్ పంత్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. అలాగే దీపక్ చాహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) చివర్లో మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టగా జోసెఫ్, హేడెన్ వాల్ష్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఓడియన్ స్మిత్, ఫేబియన్ అలన్‌లకు చెరో 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 37.1 ఓవర్లు మాత్రమే ఆడి 169 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఓడియన్ స్మిత్ (36), నికోలాస్ పూరన్ (34) మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్‌లు చెరో 2 వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…