India vs Newzealand : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 258 పరుగుల స్కోరు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా, శుబమన్ గిల్ 93 బంతులు ఆడి 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు.
చటేశ్వర్ పుజారా 88 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 63 బంతులు ఆడి 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్ 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల స్కోరు వద్ద ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్లలో కైలీ జేమిసన్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీకి 1 వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…