Brahmanandam : ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. మనిషి టెక్నాలజీ లేకపోతే తానే లేడేమో అనే స్థితికి చేరుకున్నాడు. స్మార్ట్ ఫోన్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలాగే నిత్యం మన యాక్టివిటీలను తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. దాంతో పాటు చాలా మంది ఎంటర్ టైన్ మెంట్ కోసం మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. రీసెంట్ గా ఇలా మీమ్స్ క్రియేట్ చేసేవారిపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి సోషల్ మీడియాలో మీమ్స్ అంటే బ్రహ్మానందం గుర్తొస్తారు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ తో క్రేజీ మీమ్స్ ని క్రియేట్ చేసి వైరల్ చేస్తుంటారు. ఆఫీస్, జాబ్, ఇంట్లో రకరకాల ప్రెషర్స్ నుండి ఈ మీమ్స్ చూస్తే చాలు తెగ నవ్వొచ్చేస్తుంటాయి.
రీసెంట్ గా ఆలీ హోస్ట్ చేసే ప్రోగ్రామ్ కి బ్రహ్మానందం గెస్ట్ గా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ లో బ్రహ్మానందాన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక మీమ్స్ క్రియేట్ చేసేవారు ఎక్కువగా మీ ఇమేజెస్ నే వాడుతుందటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని, కొన్ని కారణాలతో తాను సినిమాల్లో నటించడం లేదని, అయినా కూడా నన్ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది.. వారేనని అన్నారు బ్రహ్మానందం.
ఇంకా వాట్సాప్ లో సైతం బ్రహ్మి కామెడీ స్టిక్కర్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు బ్రహ్మానందం ఆల్ టైమ్ ఫేవరెట్ కమెడియన్. ఈయన హ్యుమర్ కి ఎంతోమంది ఫిదా అవుతూనే ఉంటారు. త్వరలో టెలికాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…