India vs Newzealand : కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ గెలుపొందింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ చతికిలబడింది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 73 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాన్టనర్ 3 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె, లాకీ ఫెర్గుసన్, ఇష్ సోధిలు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 111 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మార్టిన్ గప్తిల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన కూడా చేయలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా, హర్షల్ పటేల్ 2, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, వెంకటేష్ అయ్యర్ లు 1 చొప్పున వికెట్లు తీశారు. కాగా చివరిదైన ఈ టీ20 మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…