Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమంలో సండే ఫన్‌డేగా సాగింది. హౌజ్‌మేట్స్‌తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటన్న ప్రశ్నకు.. మానస్.. ఫ్రెండ్ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ప్రియాంకను ఇదే ప్రశ్న అడగగా, ఆమె కూడా అలాగే బదులు ఇచ్చింది. శ్రీరామ్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా ? అన్న ప్రశ్నకు రవి లేదని చెప్పాడు.
ఈ వారం ‘అనుభవించు రాజా’ హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. తర్వాత ఒక్కో డైలాగ్‌ను ఒక్కొక్కరికీ అంకితమివ్వాలంటూ ఓ సరదా గేమ్ ఆడించాడు నాగ్. ‘నన్ను రెచ్చగొట్టకు’ అన్న డైలాగ్‌ను మానస్.. సన్నీకిచ్చాడు.
‘నమ్మకం లేదు దొర’ డైలాగ్‌ను షణ్ను.. రవికిచ్చాడు. ‘సరె సర్లే చాలా చూశాం’ అన్న బోర్డును షణ్నుకిచ్చాడు రవి. ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా నీలో.. కమల్ హాసన్’ అన్న డైలాగ్ బోర్డును యానీ రవికి అంకితమిచ్చింది. ‘ఓన్లీ వన్స్ ఫసక్’ బోర్డును ప్రియాంక.. మానస్‌కు ఇచ్చింది. ‘ఏమో సర్, నాకు కనబడదు’ డైలాగ్ షణ్నుకు సరిగ్గా సెట్టవుతుందన్నాడు శ్రీరామ్.
‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. ‘నీ బొందరా నీ బొంద’ డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది కాజల్. ‘అయిపాయే’ అనేది రవికి సెట్టవుతుందన్నాడు సన్నీ. అనంతరం సిరి, ప్రియాంక సేఫ్ అవగా యానీ ఎలిమినేట్ అయింది. అనీ ఎలిమినేట్ కావడంతో శ్రీరామ్ చంద్ర కాస్త విచారం వ్యక్తం చేశాడు.
మంచి తమ్ముడిగా ఉన్నందుకు రవికి థ్యాంక్స్ చెప్పింది. శ్రీరామ్ మంచి ఫ్రెండ్ అంది. ప్రియాంక.. సీతాకోక చిలుక అని కాంప్లిమెంట్ ఇచ్చింది. బయటకొచ్చాక మానస్‌తో మంచి ఫ్రెండ్ అవుతానంది. సన్నీ తన ఫ్రెండ్ అని, అతడిని మిస్ అవుతానంది. కాజల్ గురించి చెప్పడానికి ఏమీ లేదని పెదవి విరించింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…