India vs Newzealand : మూడో టీ20లోనూ భార‌త్ గెలుపు.. 3-0 తేడాతో సిరీస్ కైవ‌సం..!

November 21, 2021 10:47 PM

India vs Newzealand : కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ గెలుపొందింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ చ‌తికిల‌బ‌డింది. దీంతో న్యూజిలాండ్‌పై భార‌త్ 73 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

India vs Newzealand  india won by 73 runs against newzealand in 3rd t20

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 56 ప‌రుగులు చేయ‌గా, ఇషాన్ కిష‌న్ 21 బంతుల్లో 6 ఫోర్ల‌తో 29 ప‌రుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా ఫ‌ర్వాలేద‌నిపించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మిచెల్ శాన్ట‌న‌ర్ 3 వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్‌, ఆడ‌మ్ మిల్నె, లాకీ ఫెర్గుస‌న్‌, ఇష్ సోధిలు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17.2 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. 111 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో మార్టిన్ గ‌ప్తిల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 51 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న కూడా చేయ‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ 3 వికెట్లు తీయ‌గా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ 2, దీప‌క్ చాహ‌ర్, య‌జువేంద్ర చాహ‌ల్‌, వెంక‌టేష్ అయ్య‌ర్ లు 1 చొప్పున వికెట్లు తీశారు. కాగా చివ‌రిదైన ఈ టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ గెలిచింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now