Ileana : మోడల్‌గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతోపాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. అలాగే రెమ్యూనరేషన్‌తో రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటింది. వరుస ఫ్లాపుల తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన ఈ భామ అక్కడా తన సత్తా చాటింది.
అమర్ అక్భర్ ఆంటోని చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానాను ఈ చిత్రం కూడా నిరాశపరచింది. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సందడి చేస్తోంది. రీసెంట్‌గా ఈ అమ్మడు తన రెండు వేళ్లు కట్ అయ్యాయని చెప్పింది. వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. గాయం కావడంతో చిన్న పిల్లలా ఏడ్చేశాను అని చెప్పుకొచ్చింది ఇల్లీ బేబీ.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్లకు అతడితో బంధానికి పుల్‌స్టాప్ పెట్టింది. ప్రస్తుతం వరుడి కోసం వెతుకుతున్నా.. అంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…