Ileana : తెగిన ఇలియానా వేళ్లు.. భోరున ఏడ్చిన గ్లామ‌ర్ బ్యూటీ..

October 31, 2021 11:33 PM

Ileana : మోడల్‌గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ‌ ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతోపాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది. అలాగే రెమ్యూనరేషన్‌తో రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటింది. వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన ఈ భామ అక్క‌డా త‌న స‌త్తా చాటింది.

Ileana said she cried when she get cut her fingers while cutting vegetables

అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానాను ఈ చిత్రం కూడా నిరాశ‌ప‌ర‌చింది. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ‌గా సంద‌డి చేస్తోంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు త‌న రెండు వేళ్లు క‌ట్ అయ్యాయ‌ని చెప్పింది. వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. గాయం కావ‌డంతో చిన్న పిల్ల‌లా ఏడ్చేశాను అని చెప్పుకొచ్చింది ఇల్లీ బేబీ.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం జ‌రిగింది. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ కొన్నాళ్లకు అతడితో బంధానికి పుల్‌స్టాప్ పెట్టింది. ప్ర‌స్తుతం వ‌రుడి కోసం వెతుకుతున్నా.. అంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now