Ileana : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు పరిచయం అయ్యారు. వారిలో కొంత మంది మాత్రమే స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో గోవా అందం ఇలియానా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్.. పర్‌ఫెక్ట్ ఫిగర్ ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరితోనూ నటించిన ఇలియానా తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది.
చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు లాభం చేకూర్చలేదు.
సినిమాలతో సందడి చేయలేకపోతున్న ఈ భామ ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తోంది. అయితే ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోకుండా సోలోగానే గడిపేస్తుంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దీనికి స్పందించిన ఇలియానా.. ‘పెళ్లి ఆలోచన ఉంది, కానీ వరుడు దొరకాలి కదా’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఇలియానా పెళ్లిపై అనేక రూమర్స్ వినిపించాయి.
బాయ్ ఫ్రెండ్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు అప్పట్లో పుకార్లు పుట్టించారు. కానీ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…