Ileana : పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఇలియానా.. కానీ..?

October 27, 2021 6:03 PM

Ileana : టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంతో మంది అందాల ముద్దుగుమ్మ‌లు ప‌రిచ‌యం అయ్యారు. వారిలో కొంత మంది మాత్రమే స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో గోవా అందం ఇలియానా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్.. పర్‌ఫెక్ట్ ఫిగర్ ఆమె సొంతం. స్టార్ హీరోలు అంద‌రితోనూ న‌టించిన ఇలియానా త‌న అంద‌చందాల‌తో కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది.

Ileana in thinking of marriage but here is the problem

చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు అక్క‌డ కూడా పెద్ద‌గా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల‌ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు లాభం చేకూర్చలేదు.

సినిమాల‌తో సందడి చేయ‌లేక‌పోతున్న ఈ భామ ఫొటోషూట్స్‌తో ర‌చ్చ చేస్తోంది. అయితే ఈ అమ్మ‌డు ఇంకా పెళ్లి చేసుకోకుండా సోలోగానే గ‌డిపేస్తుంది. ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దీనికి స్పందించిన ఇలియానా.. ‘పెళ్లి ఆలోచన ఉంది, కానీ వరుడు దొరకాలి కదా’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఇలియానా పెళ్లిపై అనేక రూమర్స్ వినిపించాయి.

బాయ్ ఫ్రెండ్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చిన‌ట్టు అప్ప‌ట్లో పుకార్లు పుట్టించారు. కానీ అన్నీ రూమ‌ర్స్‌గానే మిగిలిపోయాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now