Hyper Aadi : ఎప్పుడూ న‌వ్వించే హైప‌ర్ ఆది.. కంట‌త‌డి పెట్టుకున్నాడు.. కార‌ణం ఏమిటంటే..

Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నూతన కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది.

సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమో ఒకటి విడుదలైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో హైపర్ ఆది, ఇమాన్యుయేల్, ఆటో రాంప్రసాద్  వంటి వారు తమ స్కిట్స్ తో  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది.

Hyper Aadi

అసలు విషయానికి వెళ్తే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ షో మాదిరిగా ఒక టేబుల్ పై కంటెస్టెంట్స్ ఫోటోలు పెట్టారు. యాంకర్ రష్మి తమకు నచ్చని వారి ఫోటోలను కాల్చేయడం లేదా చింపేయడం చేయడం లాంటివి చేయాలి అంటూ చెప్పింది. ముందుగా ఆటో రాంప్రసాద్ టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది వలన నేను ఒక విషయంలో పర్సనల్ గా హర్ట్ అయ్యాను, సారీ ఆది అంటూ రాంప్రసాద్ ఆది ఫోటోను కాల్చేస్తాడు.

ఆ తర్వాత పరదేశి వచ్చి నాకు అన్నీ హైపర్ ఆది అని చెబుతాను కానీ ఒక రీజన్ వలన ఇలా చేయవలసి వస్తోంది అంటూ ఆది ఫోటోను చింపేస్తాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫోటోను చింపేస్తుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆది.. రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా, ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు. నాకు ఈ విషయం నచ్చలేదు అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో ఆది కంటతడి పెట్టుకుంటాడు.

ఈ ప్రోమో లో హైపర్ ఆది టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి ఒకరి ఫోటోని చేత్తో పట్టుకుంటాడు. ఆది పట్టుకున్న ఫోటో ఎవరిదో తెలియాలి అంటే ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు సైతం డైరెక్టర్ షో ను హైలెట్ చేయడానికి బాగానే ప్లాన్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM