Viral Photo : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయం వైరల్ గా మారుతోంది. ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ అందరి చూపులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోటో ఏంటంటే నాగార్జున చేతిలో ఒక చిన్నోడు ఎత్తుకొని ఉన్నాడు. ముసి ముసి నవ్వులతో ఉన్న ఆ చిన్నోడి ఫోటో అందరి చూపులను ఆకర్షిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ చిన్నోడు అనుకుంటున్నారా.. ఇప్పుడు మేము చెప్పే వివరాలతో మీరే ఆ హీరో ఎవరో గుర్తుపట్టండి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆ లవర్ బాయ్ లిస్టులో ఈ హీరో కూడా ఒకరు. తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తాతగారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 20వ దశాబ్దంలో ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది.
మన కింగ్ అక్కినేని నాగార్జున చేతిలో ఉన్న ముద్దులొలికే చిన్నవాడు ఇంకెవరో కాదు, అతనే హీరో సుమంత్. 1999 లో ప్రేమ కథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే విజయం సాధించాడు. ఆ తర్వాత యువకుడు, స్నేహమంటే ఇదేరా, సత్యం, ధన 51, మహానంది, గోదావరి, గోల్కొండ హై స్కూల్, సుబ్రహ్మణ్యపురం వంటి చిత్రాలలో నటించి సక్సెస్ ను అందుకున్నాడు.
ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా సుమంత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా సుమంత్ క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. త్వరలో సుమంత్.. మళ్లీ మొదలైంది, అనగనగా ఒక రౌడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…