Viral Photo : ముద్దులొలికే ఈ చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

August 12, 2022 3:28 PM

Viral Photo : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయం వైరల్ గా మారుతోంది. ఒక ఫోటో సోషల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తూ అందరి చూపులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోటో ఏంటంటే నాగార్జున చేతిలో ఒక చిన్నోడు ఎత్తుకొని ఉన్నాడు. ముసి ముసి నవ్వులతో ఉన్న ఆ చిన్నోడి ఫోటో అందరి చూపులను ఆకర్షిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ చిన్నోడు అనుకుంటున్నారా.. ఇప్పుడు మేము చెప్పే వివరాలతో మీరే ఆ హీరో ఎవరో గుర్తుపట్టండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆ లవర్ బాయ్ లిస్టులో ఈ హీరో కూడా ఒకరు.  తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తాతగారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 20వ దశాబ్దంలో ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది.

have you identified this child in this Viral Photo
Viral Photo

మన కింగ్ అక్కినేని నాగార్జున చేతిలో ఉన్న ముద్దులొలికే చిన్నవాడు ఇంకెవరో కాదు, అతనే హీరో సుమంత్. 1999 లో ప్రేమ కథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే విజయం సాధించాడు. ఆ తర్వాత యువకుడు, స్నేహమంటే ఇదేరా, సత్యం, ధన 51, మహానంది, గోదావరి, గోల్కొండ హై స్కూల్, సుబ్రహ్మ‌ణ్యపురం వంటి చిత్రాలలో నటించి సక్సెస్ ను అందుకున్నాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా సుమంత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా సుమంత్ క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. త్వరలో సుమంత్.. మళ్లీ మొదలైంది, అనగనగా ఒక రౌడీ చిత్రాల‌తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now