Honey : మనకు అందుబాటులో ఉన్న అత్యంత సహజసిద్ధమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆయుర్వేద పరంగా తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గించగలదు. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు రావు. కనుక తేనెను ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
అయితే స్వచ్ఛమైన అడవి తేనె మనకు చాలా తక్కువగా లభిస్తుంది. కొందరు దీన్ని విక్రయిస్తారు కానీ అది నకిలీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే స్వచ్ఛమైన అడవి తేనెను ఎలా గుర్తించాలి.. అందుకు ఏం చిట్కాలు ఉన్నాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన అడవి తేనె అయితే అగ్గిపుల్లను ఆ తేనెలో ముంచి అనంతరం దాన్ని వెలిగించాలి. అది మండితే తేనె స్వచ్ఛమైనదని గుర్తించాలి. అయితే ఈ చిట్కా అన్ని సందర్బాల్లోనూ పనిచేయకపోవచ్చు. కానీ స్వచ్ఛమైన తేనె అయితే నీటిలో స్పూన్‌తో కలిపితే వేగంగా కరుగుతుంది. అదే నకిలీ అయితే అంత సులభంగా కరగదు.
ఇక స్వచ్ఛమైన తేనెను నాలుకతో నాకితే కొండనాలుకకు ఘాటు తగిలినట్లు అనిపిస్తుంది. కారంగా ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన తేనెను కాగితం మీద వేస్తే అంత సులభంగా తడవదు. కాస్త ఆలస్యం అవుతుంది. కానీ కల్తీ తేనె అయితే కాగితం త్వరగా తడుస్తుంది. ఇలా స్వచ్ఛమైన అడవి తేనెను సులభంగా గుర్తించవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…