Magadheera : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అనేక చిత్రాల్లో మగధీర ఒకటి. రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం 30 జూలై 2009న రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రామ్ చరణ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనేక రికార్డులను కొల్లగొట్టింది. అప్పట్లో ఈ మూవీ టాలీవుడ్‌లోనే ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఏకంగా రూ.150 కోట్లను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హై కలెక్షన్స్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.
అయితే మగధీరలో పునర్జన్మ అనే అంశాన్ని చూపించారు. 400 ఏళ్ల కిందట కొన్ని విపత్కర పరిస్థితుల మధ్య చనిపోయిన ఒక జంట.. అప్పటి కొందరు వ్యక్తులు మళ్లీ 400 ఏళ్ల తరువాత జన్మించి అనూహ్య పరిస్థితుల్లో కలుసుకుంటారు. దీంతో వారికి గత జన్మ గుర్తుకు వస్తుంది. ఇక ఆ జన్మలో ప్రేమ విఫలం అయింది కనుక ఈ జన్మలో కచ్చితంగా వీరు కలవాలి అని ప్రేక్షకులు కోరుకుంటారు. సినిమా మొత్తం ఇదే కథాంశంపై నడుస్తుంది. అందుకనే మూవీ హిట్ అయింది.
అయితే మగధీర్‌లో రామ్ చరణ్, కాజల్ ఇద్దరూ చేతివేళ్లు కలవగానే వారిలో విద్యుత్ లాంటిది ప్రవహించి వారికి పూర్వ జన్మ గుర్తుకు వస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు తరువాత పెళ్లి చేసుకుని కాపురం చేస్తే ఎలా.. ఇద్దరూ టచ్ చేసుకుంటారు కదా.. అప్పుడు కూడా విద్యుత్ ప్రవహిస్తుంది కదా.. మరలాంటప్పుడు వారు కాపురం ఎలా చేస్తారు.. అసలు ఇద్దరూ ఒకరినొకరు కనీసం ఎలా టచ్ చేసుకుంటారు.. అన్న ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇందుకు సమాధానాలు చెప్పడం దర్శకుడి చేతుల్లోనే ఉంది. కానీ ఈ లాజిక్‌ను అసలు ప్రేక్షకులు ఎవరూ ఆలోచించలేదు. గుర్తించలేదు. అసలు ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు. కానీ సినిమాను అలా చూస్తూ ఎంజాయ్ చేశారు. కథ బాగుంటే ఇలాంటి లాజిక్స్ ఎన్ని మిస్ అయినా ఓకే. అదే కథ లేకపోతే ఇలాంటి అంశాలను కూడా వేలెత్తి చూపిస్తారు. కనుక సినిమాకు కథ ఆయువు పట్టు లాంటిదని చెప్పవచ్చు. కనుకనే ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పటికీ మగధీరను ప్రేక్షకులు ఆదరించారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…