చరణ్ కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్లు..!

August 19, 2022 2:28 PM

RRR చిత్రంతో మన తెలుగు తెర ఖ్యాతిని మరొకసారి చాటి చూపారు దర్శక ధీరుడు రాజమౌళి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వెయ్యి కోట్లు గ్రాస్ వసూలు రాబట్టుకుంది. బాహుబలి తర్వాత RRR విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బ్రేక్ చేస్తూ మన సత్తాను చాటి చెప్పింది. కేవలం RRR థియేటర్ల‌లోనే కాదు, OTT లో కూడా ఘన విజయాన్ని సాధించింది.

ఈ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల‌కి క్రేజీ పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తమ నటనా ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఇద్దరిలో ఏ ఒక్కరి నటనను తక్కువ చేసి చూపలేము. ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా నటనను పండించారు. విడుదలై ఇన్ని రోజులైనా కూడా సోషల్ మీడియా వేదికగా RRR ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ చిత్రం విదేశీ ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తోంది.

hollywood directors want to do film with ram charan

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి విడుదలైన కెప్టెన్ అమెరికా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్ర దర్శకులు సైతం RRR చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్రను హాలీవుడ్ దర్శక నిర్మాతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ లో ది విచ‌ర్ వంటి అద్భుతమైన కథాంశాన్ని అందించిన ఆండ్రెడ్జ్‌ వంటి రైటర్ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది అనే కోరికను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వ్యక్తం చేశారు.

కెప్టెన్ అమెరికా దర్శకులు సైతం రామ్ చరణ్ ను పొగుడుతూ ట్వీట్ చేయడంతో హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం రామ్ చరణ్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వంటి సంస్థలో కెప్టెన్ అమెరికా స్థాయిలో సూపర్ హీరోగా సినిమా చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో Rc15 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఇది 50వ‌ చిత్రం కావడంతో Rc15ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా విక్రం చిత్ర దర్శకుడైన లోకేష్ కనగరాజ్ తో కూడా త్వరలో రామ్ చరణ్ ఒక చిత్రం చేయబోతున్నారు. అంటే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఈ క్ర‌మంలోనే హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రామ్ చరణ్ కోసం క్యూ కడుతున్నార‌ని తెలుస్తోంది. రామ్ చరణ్ దూకుడు చూస్తుంటే త్వరలోనే హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment