Himaja : ప్రస్తుత తరుణంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులపై వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. కొందరు అలాంటి వార్తలకు మరింత మసాలా పూసి కావాలని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. దీంతో అవి నిజమే అని నమ్ముతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు సైతం ఆ వార్తలను ప్రచురించి తరువాత అవి తప్పు అని తెలుసుకుని బొక్క బోర్లా పడుతున్నాయి. ఇక తాజాగా నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ విషయంలోనూ కొన్ని ఫేక్ వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. వాటిపై ఆమె స్పందించింది.
నటి హిమజ పేరు గత రెండు రోజులుగా వార్తల్లో బాగా వినిపిస్తోంది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే దీనిపై హిమజ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ వీడియోలో అసలు విషయం చెప్పింది. ఆ వార్తలపై స్పష్టతనిచ్చింది. ఇంతకు అసలు ఆమె ఏమన్నదంటే..
ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా నేను ఇవన్నీ పట్టించుకోను.. కానీ మా పేరెంట్స్ కాస్త సెన్సిటివ్.. ఇలాంటివి తెలిస్తే బాధపడతారు. ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేయకండి. పెళిళ్లు నాకు సెట్ కావు, ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటున్నా. సింగిల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నా. 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికీ చెప్పి చేసుకుంటా. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి.. అంటూ హిమజ చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది.
కాగా హిమజ గతంలో.. నేను శైలజ, వరుడు కావలెను తదితర సినిమాలలో నటించింది. అనంతరం బిగ్ బాస్ షో లో పాల్గొన్న ఈమె మరింత పాపులారిటీని తెచ్చుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…