Himaja : న‌టి హిమ‌జ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతుందా ? స్పందించిన హిమ‌జ‌..!

January 28, 2022 5:53 PM

Himaja : ప్ర‌స్తుత త‌రుణంలో సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు, విడాకుల‌పై వార్త‌లు బాగా ప్రచారం అవుతున్నాయి. కొంద‌రు అలాంటి వార్త‌ల‌కు మ‌రింత మసాలా పూసి కావాల‌ని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. దీంతో అవి నిజ‌మే అని న‌మ్ముతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ‌లు సైతం ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించి త‌రువాత అవి త‌ప్పు అని తెలుసుకుని బొక్క బోర్లా ప‌డుతున్నాయి. ఇక తాజాగా న‌టి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ విష‌యంలోనూ కొన్ని ఫేక్ వార్త‌లు బాగా ప్ర‌చారం అయ్యాయి. వాటిపై ఆమె స్పందించింది.

Himaja responded over her divorce news

న‌టి హిమ‌జ పేరు గ‌త రెండు రోజులుగా వార్త‌ల్లో బాగా వినిపిస్తోంది. ఆమె త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతుందంటూ కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే దీనిపై హిమ‌జ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమె ఓ వీడియోలో అస‌లు విష‌యం చెప్పింది. ఆ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఇంత‌కు అస‌లు ఆమె ఏమ‌న్న‌దంటే..

ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా నేను ఇవన్నీ పట్టించుకోను.. కానీ మా పేరెంట్స్‌ కాస్త సెన్సిటివ్.. ఇలాంటివి తెలిస్తే బాధపడ‌తారు. ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేయకండి. పెళిళ్లు నాకు సెట్‌ కావు, ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటున్నా. సింగిల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా. 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికీ చెప్పి చేసుకుంటా. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి.. అంటూ హిమ‌జ చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది.

కాగా హిమ‌జ గ‌తంలో.. నేను శైలజ, వరుడు కావలెను త‌దిత‌ర‌ సినిమాల‌లో నటించింది. అనంత‌రం బిగ్ బాస్ షో లో పాల్గొన్న ఈమె మ‌రింత పాపులారిటీని తెచ్చుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now