Guava Leaves Tea : జామకాయలే కాదు.. జామ ఆకులతో కూడా చాలా పోషకాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. శరీరానికి కావలసిన పోషకాలు అందాలంటే రోజూ ఉదయం జామ ఆకుల టీ తాగాలని వెల్లడిస్తున్నారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. మీరు జామ టీ అసలు వదిలిపెట్టరు అంటున్నారు నిపుణులు. పుష్కలమైన పోషకాహార ఘని కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా అభివర్ణించారు. జామలో 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లుతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలతో నిండి ఉంటుంది.
ప్రతి చిన్న సమస్యకి మనము మందులు వేసుకోకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనకు అందించింది. డెంగ్యూ అనగానే మనము చాలా భయపడుతుంటారు. ఎందుకంటే డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి జామ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. 10 జామ ఆకులను తీసుకొని మూడు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించి అవి ఒక కప్పు నీరు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి ఆ నీటిని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తాగిస్తే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇలా రోజుకి మూడు కప్పులు ఇవ్వాలి. జామ ఆకులతో టీ తయారుచేసుకొని తాగితే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
జామ ఆకులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి. అంతేకాకుండా జామ ఆకుల టీ యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది. అలాగే జామ ఆకుల టీ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామలో ఉండే లైకోపీన్ అనే పదార్థం ఒక యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది.
జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. జామకాయ మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతుంది అని అనేక పరిశోధనలో వెళ్లడయింది. దగ్గు జలుబు అధికంగా ఉన్నవారు జామాకులని ఇలా టీ చేసుకుని తాగడం వల్ల కఫదోషం అనేది తగ్గుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…