Belly Fat : ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది. ఒకటి వ్యాయామం చేసినప్పుడు, మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు. అలాగే నిద్ర పోయే ముందుగా కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఎవరైతే నిద్ర పోవడానికి రెండు నుంచి మూడు గంటలు ముందు భోజనం చేస్తారో అలాంటి వారి శరీరంపై బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా వేగంగా అద్భుతంగా పనిచేస్తాయి. దీని వలన ఒక సాధారణమైన వ్యక్తి 800 గ్రాముల నుండి ఒక కిలో బరువు వరకు నిద్రలోనే చాలా సులభంగా తగ్గుతారు. ఏ వ్యాయామం లేకుండా నిద్రలోనే బరువు తగ్గించాలి అనుకుంటే ఈ ఒక చిట్కా ఉపయోగిస్తే చాలు . ఈ చిట్కా కొరకు మీరు ఇప్పుడు చెప్పబోయే పౌడర్ ని తయారు చేసుకొని భద్రపరచుకోవాలి. మరి పౌడర్ తయారీ విధానం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి ఉపయోగించే ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు ఏమిటంటే.. సోంపు 50 గ్రాములు, ½ టీ స్పూన్ పసుపు, అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) 25 గ్రాములు, జీలకర్ర 25 గ్రాములు, కరివేపాకు పొడి 25 గ్రాములు, కరక్కాయ 25 గ్రాములు (కరక్కాయ పౌడర్ దొరకకపోతే త్రిఫల చూర్ణం కూడా వాడుకోవచ్చు.) ½ టీ స్పూన్ సైంధవ లవణం, ఇంగువ 2 చిటికెలు.
ముందుగా అవిసె గింజలు, సోంపు, జీలకర్రను స్టవ్ లో ఫ్లేమ్ పై పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు మిశ్రమాలను చల్లబడిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పౌడర్ లోకి 25 గ్రాముల కరక్కాయ పౌడర్, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సైంధవలవణం వేసుకోవాలి. సైంధవ లవణం లేకపోతే నల్ల ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో రెండు చిటికెలు ఇంగువ, 25 గ్రాములు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఈ పొడిని భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్ర పోయే ఒక గంట ముందు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి. మీకు దీని ఫలితాలు ఇంక తొందరగా కావాలి అనుకుంటే కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. కానీ దీన్ని ప్రతిసారి కేవలం ఒక్కసారి పావు టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకుని తాగాలి. అంతకు మించి ఎక్కువగా కలుపుకుని తాగకూడదు.
ఈ పౌడర్ మన పొట్ట చుట్టూ మరియు మిగతా శరీర భాగాలలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పొడిలో అవిసె గింజలు వాడడం వలన ఇందులో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఎవరైతే మలబద్దక సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రోజు అవిసె గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి సహాయంతో తీపి మరియు ఎక్కువగా ఫై చేసిన ఆహారపదార్థాలు సులభంగా కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…