Lottery : సమాజంలో మనం జీవించడం మాత్రమే కాదు, మన తోటి వారు జీవించేందుకు కూడా సహాయ పడాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మనకు కలిగినంతలో పక్క వారికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ విధంగా చేసేవారు సమాజంలో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఆ బామ్మ ఒకరని చెప్పవచ్చు. తనకు లాటరీ తగిలితే అందులో సగం మొత్తాన్ని టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చి ఉదారతను చాటుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన 86 ఏళ్ల మారియన్ ఫారెస్ట్ అనే వృద్ధురాలు ఇటీవల ఓ స్టోర్‌లో ఓ లాటరీ టిక్కెట్‌ను కొనుగోల చేసింది. అది తగిలితే మొదటి బహుమతి కింద 5 లక్షల డాలర్లను ఇస్తారు. అయితే ఆమెకు ఆ లాటరీలో 300 డాలర్లు వచ్చాయి. ఆమెకు తగిలిన లాటరీ మొత్తం చిన్నదే అయినప్పటికీ ఆమె అందులో సగం మొత్తాన్ని తనకు టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చింది.
ఈ క్రమంలోనే మారియన్ సదరు స్టోర్‌కు వెళ్లి తనకు వచ్చిన లాటరీలో సగాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె చేసిన పనికి అందరూ ఆమెను అభినందిస్తున్నారు. తగిలిన లాటరీ మొత్తం తక్కువే అయినా.. ఆ బామ్మ అందులో సగం మొత్తాన్ని ఆ టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…