Lottery : లాట‌రీ గెలిచిన 86 ఏళ్ల బామ్మ‌.. స‌గం మొత్తాన్ని టిక్కెట్‌ అమ్మిన వ్య‌క్తికి ఇచ్చింది..

January 8, 2022 5:24 PM

Lottery : స‌మాజంలో మ‌నం జీవించ‌డం మాత్ర‌మే కాదు, మ‌న తోటి వారు జీవించేందుకు కూడా స‌హాయ ప‌డాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మ‌న‌కు క‌లిగినంతలో ప‌క్క వారికి స‌హాయం చేయాలి. ఆప‌దలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ విధంగా చేసేవారు స‌మాజంలో చాలా త‌క్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఆ బామ్మ ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. త‌న‌కు లాట‌రీ త‌గిలితే అందులో స‌గం మొత్తాన్ని టిక్కెట్ అమ్మిన వ్య‌క్తికి ఇచ్చి ఉదార‌త‌ను చాటుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

grand ma won Lottery she has given half amount to ticket seller

అమెరికాకు చెందిన 86 ఏళ్ల మారియ‌న్ ఫారెస్ట్ అనే వృద్ధురాలు ఇటీవ‌ల ఓ స్టోర్‌లో ఓ లాట‌రీ టిక్కెట్‌ను కొనుగోల చేసింది. అది త‌గిలితే మొద‌టి బ‌హుమ‌తి కింద 5 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను ఇస్తారు. అయితే ఆమెకు ఆ లాట‌రీలో 300 డాల‌ర్లు వ‌చ్చాయి. ఆమెకు త‌గిలిన లాట‌రీ మొత్తం చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ ఆమె అందులో స‌గం మొత్తాన్ని త‌న‌కు టిక్కెట్ అమ్మిన వ్య‌క్తికి ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే మారియ‌న్ స‌ద‌రు స్టోర్‌కు వెళ్లి త‌న‌కు వ‌చ్చిన లాట‌రీలో స‌గాన్ని ఆ వ్య‌క్తికి ఇచ్చి అత‌న్ని ప్రేమ‌గా ఆలింగ‌నం చేసుకుంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఆమె చేసిన ప‌నికి అంద‌రూ ఆమెను అభినందిస్తున్నారు. తగిలిన లాట‌రీ మొత్తం త‌క్కువే అయినా.. ఆ బామ్మ అందులో స‌గం మొత్తాన్ని ఆ టిక్కెట్ అమ్మిన వ్య‌క్తికి ఇచ్చినందుకు నెటిజ‌న్లు ఆమెను ప్ర‌శంసిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment