Gowri Munjal : అల్లు అర్జున్ పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందంటే..?

November 25, 2022 10:23 AM

Gowri Munjal : సినీ ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఎక్కువకాలం ఫామ్ లో ఉండాలంటే ఖచ్చితంగా కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగు వేయాలి. కెరిర్ బిగినింగ్ లో ఒక్క హిట్ పడేసరికి వరుసగా అవకాశాలు తలుపు తడతాయి. కానీ అందులో కెరీర్ కి సక్సెస్ బాటలో నడిపించే కథలు, క్యారెక్టర్స్ ఏవో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం హీరో హీరోయిన్స్ కి ఉంటుంది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథను ఎంచుకునే విషయంలో తప్పటడుగు వేస్తే మాత్రం, ఫేడ్ అవుట్ జాబితాలో త్వరగా చేరిపోతారు.

ఇదే కోవకు చెందిన హీరోయిన్స్ లో గౌరీ ముంజల్ కూడా ఒకరు. తెలుగులో డెబ్యూ సినిమా అయినా బన్ని మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఢిల్లీకి చెందిన అమ్మాయి. అల్లు అర్జున్ సరసన బన్ని సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈ భామ తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. సరైన కథలను ఎంచుకోలేక స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సిన గౌరీ వరుస ప్లాప్స్ కారణంగా చిన్న సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి పడిపోయింది.

Gowri Munjal have you seen how is she now
Gowri Munjal

తెలుగు, కన్నడ మాత్రమే కాకుండా తమిళ, మలయాళం భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడా రాణించలేకపోయింది. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయి ఆరేళ్లకే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. బన్ని మూవీ తర్వాత తెలుగులో శ్రీకృష్ణ 2006, గోపి గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామా లాంటి సినిమాలు నటించింది గౌరీ ముంజల్.

ఇక 2011వ సంవత్సరం మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో కనిపించిన గౌరీ ముంజల్. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో పర్సనల్ లైఫ్ పై పూర్తి ఫోకస్ పెట్టింది. పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలకు దూరమైనట్లు సమాచారం వినిపిస్తుంది. గౌరీ ముంజల్ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి ఉంటూ పలు వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now