Godfather First Review : గాడ్‌ఫాద‌ర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. బొమ్మ ఎలా ఉంది..?

September 23, 2022 7:37 PM

Godfather First Review : చిరు మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై రామ్‌ చరణ్‌, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ అందించాడు.

అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ మూవీ మేకర్స్ ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు మోహనరాజా తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. సినిమా పొలిటికల్ డ్రామాగా చాలా బాగుందని.. మెగాస్టార్ తన నటనతో అదరగొట్టేసాడని సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించారట.

Godfather First Review do you know how is the movie
Godfather First Review

ఇక డైరెక్టర్ మోహన్ రాజా ఇదే విషయం చెబుతూ ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఫైనల్ గా సినిమాకు పాజిటివ్ బజ్‌ రావడంతో సినిమా మేకర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్టోబర్ 5 న నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు పోటీగా గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే అదే రోజు మంచి విష్ణు జిన్నా సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక దసరా బరిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now