God Father Movie : చిరంజీవి అలా చేశారేంటి.. తీవ్ర అసంతృప్తిలో ఫ్యాన్స్‌..!

July 4, 2022 8:25 PM

God Father Movie : సినిమాను ఒక‌సారి ఒక భాష‌లో తీశాక దాన్ని ఇంకో భాష‌లో రీమేక్ చేయ‌డం అంటే.. అది సాహ‌స‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ఒరిజిన‌ల్ సినిమాను రీమేక్‌తో పోలుస్తారు. అందులో ఉన్న ప్ల‌స్‌లు ఏమిటి.. ఇందులో ఉన్న మైన‌స్‌లు ఏమిటి.. ఒరిజిన‌ల్‌లో బాగానే చేశారు క‌దా.. రీమేక్‌లో అస‌లు బాగా లేదు.. అన్న కామెంట్లు స‌హ‌జంగానే వినిపిస్తాయి. క‌నుక మేక‌ర్స్ ఎప్పుడైనా స‌రే సినిమాల‌ను రీమేక్ చేసేట‌ప్పుడు ఒరిజిన‌ల్‌కు త‌గ్గట్లుగా ఉండాలి. భారీ ఎత్తున మార్పుల‌ను చేయ‌కూడ‌దు. అలా చేస్తే ఒరిజిన‌ల్‌ను పోల్చి చూసి బాగాలేద‌నే అంటారు. అవును.. స‌రిగ్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాకు కూడా ఇలాగే జ‌రుగుతోంది. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటంటే..

మ‌ళ‌యాళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మోహ‌న్‌లాల్ సినిమా లూసిఫ‌ర్ గుర్తుంది క‌దా. ఈ మూవీ తెలుగులోనూ డ‌బ్బింగ్ అయింది. అయితే ఈ సినిమా క‌థ‌నే చిరంజీవి మ‌ళ్లీ గాడ్ ఫాద‌ర్ మూవీగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనేక మంది కీల‌క న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ముఖ్యంగా స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌న‌తార‌, సునీల్‌, అన‌సూయ వంటి వారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరంజీవికి చెందిన ఫ‌స్ట్ లుక్‌ను లేటెస్ట్‌గా విడుద‌ల చేశారు. ఇందులో ఆయన నలుపు రంగు డ్రెస్ ధ‌రించి తెల్ల జుట్టుతో క‌నిపించారు. అయితే ఒరిజిన‌ల్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది.

God Father Movie Chiranjeevi first look fans disappointed
God Father Movie

మ‌ళ‌యాళం లూసిఫ‌ర్ సినిమాలో మోహ‌న్‌లాల్ వైట్ అండ్ వైట్‌లో పంచెక‌ట్టుతో క‌నిపించారు. అలాగే ఆయ‌న‌కు తెల్ల జుట్టు కూడా ఉండ‌దు. కానీ గాడ్ ఫాద‌ర్ లో మాత్రం చిరంజీవి తెల్ల జుట్టుతో క‌నిపించ‌డ‌మే కాకుండా న‌లుపు రంగు దుస్తుల‌ను ధ‌రించి ఉన్నారు. ఇదే ఫ్యాన్స్‌కు న‌చ్చ‌లేదు. వైట్ అండ్ వైట్ అయితే చాలా బాగుండేద‌ని.. అలాగే తెల్ల జుట్టు అస‌లు ఏమీ బాగా లేద‌ని.. అందువ‌ల్ల ఈ సినిమాలో చిరంజీవి లుక్ న‌చ్చ‌డం లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే చిరు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్నారు.

అస‌లే ఆచార్య ఫ్లాప్ కార‌ణంగా తీవ్రంగా విచారం చేస్తున్న ఫ్యాన్స్‌కు గోటి చుట్టుపై రోక‌లిపోటులా గాడ్ ఫాద‌ర్‌లో చిరు లుక్ మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే సినిమా ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్తి చేశారు క‌నుక ఇప్ప‌టిక‌ప్పుడు చిరు లుక్‌ను మార్చ‌లేరు. కానీ లుక్ సంగతి ప‌క్క‌న పెడితే అస‌లు సినిమాను ఎలా తీసి ఉంటారు.. ఒరిజిన‌ల్‌లాగే ఉంటుందా.. లేక పూర్తిగా మార్చేశారా.. అన్న ప్ర‌శ్న‌లు కూడా ఫ్యాన్స్‌కు వ‌స్తున్నాయి. అయితే భారీ మార్పులు చేస్తే గ‌న‌క సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ ప‌డే ప్ర‌మాదం ఉంటుంది. ఎందుకంటే ఒరిజిన‌ల్‌తో పోలుస్తూ ఈ మూవీని చూస్తారు. అప్పుడు ఒరిజిన‌ల్‌లో మాదిరిగా లేక‌పోతే.. తీవ్ర అసంతృప్తికి లోన‌వుతారు. దీంతో సినిమాను ఎవ‌రూ చూడ‌రు. ఫ‌లితంగా మ‌ళ్లీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంటుంది. అదే జ‌రిగితే చిరు ఖాతాలో ఇంకో ఫ్లాప్ జ‌మ అవుతుంది. మ‌రి అక్క‌డి వ‌ర‌కు ప‌రిస్థితులు దారి తీస్తాయా.. అస‌లు సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా.. అన్న‌ది సినిమా విడుద‌ల అయితే గానీ తెలియ‌దు. కానీ చిరు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మాత్రం ఫ్యాన్స్ ను బాగానే డిజ‌ప్పాయింట్ చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now