Garikapati : చిరుకి గ‌రిక‌పాటి ఫోన్‌..? కాల్ లో క్ష‌మాప‌ణ‌లు..?

October 7, 2022 8:35 PM

Garikapati : ప్రముఖ ప్రవనచనకర్త.. గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవిలాంటి స్టార్‌ హీరోను ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆయన వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబుతో సహా.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి ఇలా మాట్లాడటం తగదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ గరికపాటిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. మెగాస్టార్‌ని ఉద్దేశించి అలా అసహనం వ్యక్తం చేయడం ఏంటి.. ఆయన స్టార్‌ హీరో.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంటుంది.

అసలు అంతమంది ఆ ప్రోగ్రాంకి వచ్చిందే చిరంజీవిని చూడ్డానికి. అలాంటిది అభిమాన హీరోని చూసిన వెంటనే ఫోటోలు దిగాలని ఎవరైనా భావిస్తారు. ఇక అభిమానులే తన బలం అని నమ్మే చిరంజీవి.. వారిని నిరుత్సాహపరచరు. అందుకే అంత ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగారు. అందులో తప్పేం ఉంది. దీనిపై గరికపాటి మరి ఆ రేంజ్‌లో అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. బహుశా మెగాస్టార్‌ క్రేజ్‌ ముందు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే గరికపాటి.. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసి ఉంటాడు.

Garikapati reportedly said apologies to Chiranjeevi through phone call
Garikapati

కనుక గరికపాటి.. చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే గరికపాటికి గిరిగిపాటి అని పేరు పెట్టడమే కాక.. ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామనే ఫోటో కార్డు ఒకటి ప్రసుత్తం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో గరికపాటి మెగాస్టార్ కు కాల్ చేసి మాట్లాడి ఇష్యూని చల్లబరుస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. గరికపాటి తన దురుసు ప్రవర్తనతో మెగాస్టార్‌ను పబ్లిక్‌గా అవమానించి.. ఫోన్ కాల్‌లో కాకుండా బహిరంగంగా ఎందుకు క్షమాపణ చెప్పలేరు.. అంటూ ఓ అభిమాని పోస్ట్ చేసాడు. వాడిని వదిలెయ్ బ్రదర్..! అంటూ మరో అభిమాని కామెంట్ చేసాడు. ఈ వివాదానికి ఎవరు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now