Garikapati : అంద‌రి ముందు చిరంజీవిని గ‌రిక‌పాటి అలా అనేశారేంటి.. వీడియో వైర‌ల్‌..!

October 6, 2022 7:53 PM

Garikapati : దసరా పండగ సందర్భంగా హైద‌రాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా ప్రతి ఏడాది బండారు దత్తాత్రయ కుటుంబం ఈ వేడుకను నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్పీచ్ తో ఆకట్టుకున్నారు.

అలాగే ఈ వేడుకకు చిరంజీవితోపాటు ప్రముఖ వేదాంతి గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవితో ఫోటోలు దిగడానికి పిల్లలు మరియు మహిళలు వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా వేదికపైనే చిరంజీవి ఫొటో సెషన్ నిర్వహించడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో గరికిపాటి ప్రసంగం ప్రారంభించడం, మరోవైపు చిరంజీవితో సెల్పీలకు జనం ఎగబడటంతో విసుగెత్తిపోయారు.

Garikapati commented on Chiranjeevi at a program video viral
Garikapati

చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్‌ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి వెళ్లిపోతా అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ది చెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=SAZmC20cK6U

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now