Dance : టెలివిజన్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో గురించి తెలిసిందే. వారం వారం ఎంటర్ టైన్‌మెంట్ ను పెంచుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమోలో పల్సర్ బైక్ పాటతో ఎంట్రీ ఇచ్చింది గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ. ఆమె స్టేజీ రాగానే APSRTC లో పని చేస్తాను అని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది.
సింహాచలం దగ్గరలోని ప్రహ్లాదపురంలో బాబు విద్యానికేతన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే డాన్స్‌పై ఉన్న ఆసక్తితో రోజు ప్రాక్టీస్ చేసేవారు. టెన్త్ క్లాస్ అర్హత మీద ఆర్టీసీలో ఉద్యోగవకాశాలు ఉన్నాయని.. అమ్మ, తమ్ముడు చెప్పడంతో దానికి దరఖాస్తు చేసుకుంది. 2011లో ఝాన్సీకి జాబ్ వచ్చింది. ఆ ఏడాదే ట్రైనింగ్ కంప్లీట్ చేసి.. 2012లో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉద్యోగంలో జాయిన్ అయింది. అయితే జాబ్ వచ్చినా కూడా డాన్స్ మీద ఉన్న ఇష్టంతో అక్కడక్కడా డాన్స్ ప్రొగ్రామ్స్ చేస్తూనే ఉండేది.
అలాగే కొన్ని టీవీ ఛానల్స్‌లోనూ తన నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. జెమినీ టీవీ డాన్సింగ్ స్టార్ ప్రొగ్రామ్‌లోనూ పోటీ చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందుకుంది. అప్పుడు అంతా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అలా ప్రారంభమైన ఝాన్సీ ప్రయాణం తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. పదేళ్ల క్రితం మాటీవీలో రంగం 2 అనే కార్యక్రమంలోనూ, జీ తెలుగులో వచ్చిన తీన్మార్ అనే కార్యక్రమంలో డాన్సర్‌గా చేసింది. ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్‌తో మరో లెవల్‌కు వెళ్లిపోయింది.
కొత్త సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్‌కు ఊర మాస్ స్టెప్పులేసి ఇరగదీసింది. అక్కడ ఉన్న జడ్జి ఆమనితోపాటు యాంకర్ రష్మీ, హైపర్ ఆది, రాంప్రసాద్ ఇలా స్టేజిపై ఉన్న వాళ్లంతా ఆమెతో కలిసి స్టెప్పులేయడంతో స్టేజీ దద్దరిల్లింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాజువాక లేడీ కండక్టర్ డ్యాన్స్ న్యూసే ట్రెండింగ్‌లో ఉంది. ఇంక నెటిజన్లు కొందరు పనిలో పనిగా ఆమె పాత డాన్స్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ఝాన్సీ ఇంటర్ ఫస్టియర్ లో ఉన్నప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన భర్త కూడా ఒక డాన్సరే. నేను చేసిన ప్రతి టీవీ ప్రోగ్రాంలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా నా హస్బెండ్ ఉంటారు అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…