Food Combinations : ఒక్కోసారి మనం తినే ఆహార పదార్థాలే మన ప్రాణం మీదకి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది వారు తినే ఆహారంలో ఏవైనా రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల వారి రుచిగా అనిపించి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ, కొన్ని కాంబినేషన్లు మాత్రం స్లో పాయిజన్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మీకు తెలుసా? అందుకే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలోచనలేకుండా కలిపి తింటే కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకువస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏ రెండు ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, నెయ్యి విడి విడిగా చూస్తే రెండు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఆహార పదార్థాలు . అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వీటి వల్ల స్లో పాయిజన్‌గా మారుతుంది. అందుకే చాలా చోట్ల ఈ రెండింటిని కలిపాలంటే రెండు సమాన మోతాదుల్లో వేయరు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ వేస్తారు.
పాలు, అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వు, అరటిపండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పుడు సమస్య రాకపోయినా… భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. ఈ రెండు కలిపి తింటే జీర్ణాశయంలో పులిసిపోయి చర్మ సంబంధ వ్యాధులు అవటానికి కారణం అవుతాయి. అంతేకాదు గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఇక మరికొందరికి కొన్ని కూరల్లో పాలు పోసి వండటం ఎక్కుగా అలవాటు. అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులకి దారి తీస్తుంది. ఆకు కూరల్లో పాలు పోసి వండటం అంత మంచిది కాదు.
అలాగే చాలామంది సలాడ్స్ లో టమోటా కీరదోస కలిపి తింటూ ఉంటారు. ఈ రెండు కలిపి అసలు తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటికి రెండు విభిన్నమైన గుణాలు కలిగి ఉంటాయి. దీని వల్ల మీ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. చాలామంది భోజనం చేసిన వెంటనే సలాడ్స్ తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మీ కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే సలాడ్స్ తినాలి.
అలాగే సలాడ్స్ లో క్యారెట్ వేస్తే అందులో నిమ్మకాయ మాత్రం ఉపయోగించకూడదు. ఈ రెండు కలిపి తింటే మీ గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. సలాడ్స్ లో ముల్లంగి ఉంటే ముల్లంగి తిన్న తర్వాత పాలు, తేనే, అరటికాయ అస్సలు తినకూడదు. అదేవిధంగా గుడ్డు, పొట్లకాయ కలిపి వండుకొని తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తుంది అని పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…