Kanipakam Temple : కాణిపాకం ఆల‌యం గురించి చాలా మందికి తెలియని విశేషాలు ఇవే..!

Kanipakam Temple : మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం సర్వవిఘ్నాలను హరించే కాణిపాకం వినాయకుడి చరిత్ర గురించి తెలుసుకుందాం.   ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి..? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాణిపాకంలో వినాయ‌కున్ని ఎవ‌రు ప్ర‌తిష్టించ‌లేదు. ఆయన అక్క‌డ స్వ‌యంభువుగా వెలిశాడ‌ని చ‌రిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ క‌థ కూడా అక్క‌డ ప్ర‌చార్యంలో ఉంది.  ఒకానొక కాలంలో ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్య‌వ‌సాయం జీవనం గడిపేవారు. వారి వ్యవసాయ  భూమిలో ఎప్పుడూ పంట‌లు బాగా పండేవి.

అయితే ఒక‌సారి వారి వ్య‌వ‌సాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండ‌డాన్ని వారు గ‌మ‌నించారు. దీంతో వారు ఆ బావిని కొంత లోతు తవ్వితే నీరు వ‌స్తుంద‌ని భావించి వెంట‌నే ఆ బావిని తవ్వ‌డం మొద‌లు పెట్టారు. అలా వారు కొంత లోతు త‌వ్వ‌గానే ఓ రాయి తగిలింది. వెంటనే ఆ బావినిండా ర‌క్తం ఊరటం మొదలయ్యింది. అలా క్ర‌మ క్ర‌మంగా ఆ బావి మొత్తం ర‌క్తంతో నిండిపోయింది. అయితే అదే స‌మ‌యంలో ఆ అన్నదమ్ములకు బావిలో వినాయ‌కుడి విగ్ర‌హం కనిపిస్తుంది. దీంతో వారు త‌వ్వ‌డం ఆపి విగ్ర‌హాన్ని పూజిస్తారు. ఈ క్ర‌మంలో వెంట‌నే వారికి ఉన్న వైక‌ల్యాలు పోయి వారు మామూలు మ‌నుషులుగా మారుతారు. అలా ఆ విష‌యం ఆ నోట ఈ నోట  ఆ గ్రామంలోని ఇత‌ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస్తుంది.

Kanipakam Temple

దీంతో వారు కూడా వినాయ‌కున్ని పూజించ‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలోనే వారు స్వామివారికి కొట్టే కొబ్బ‌రికాయ‌ల నుంచి వ‌చ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది. దీంతో వారి పంట‌లు ప‌చ్చగా పండుతాయి. గ్రామం సకల సంపదలతో సుభిక్షంగా మారుతుంది. అలా వ్య‌వ‌సాయ భూముల్లో నీరు ప్ర‌వ‌హించే స‌రికి ఆ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే.. స్వామివారి విగ్ర‌హం రోజూ కొంత ప‌రిమాణం పెరుగుతుంది.  అందుకు సాక్ష్యం ఆయ‌న‌కు ధ‌రించే తొడుగులే. ఒక‌ప్పుడు భ‌క్తులు ఆయ‌న విగ్ర‌హానికి చేయించిన తొడుగులు ఇప్పుడు స‌రిపోవ‌డం లేదు. విగ్ర‌హం సైజు కాలక్రమేనా పెరిగింది.  వెండి తొడుగులు ఆయన విగ్ర‌హం పెరుగుతుంద‌న‌డానికి సాక్ష్యాలు అని అక్కడ పండితులు వెల్లడిస్తున్నారు. 

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్ప‌టికీ కూడా ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని ప‌ర‌మ ప‌విత్రంగా భావించి భ‌క్తుల‌కు తీర్థంగా తీసుకుంటారు. చాలామంది త‌ప్పులు చేసినవారిని కాణిపాకం  తీసుకువచ్చి ఆల‌యం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన త‌ప్పుల‌ను ఒప్పుకుంటార‌ని భ‌క్తుల నమ్మకం. అలాగే కాణిపాకం ఆల‌యంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుంద‌ట‌. అది ఎవ‌రికీ అప‌కారం చేయ‌ద‌ని, అది దేవ‌తా సర్ప‌మ‌ని వచ్చే కాణిపాకం వచ్చే భ‌క్తులు న‌మ్ముతారు. ఇంత విశిష్టత కలిగిన కాణిపాక విఘ్నేశ్వరుని ఒకసారి దర్శిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM