Rajamouli : రాజ‌మౌళి స‌ల‌హా అయితే హిట్‌.. చిరంజీవి స‌ల‌హా అయితే ఫ్లాప్..!

Rajamouli : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా ఆగ‌స్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగానే ఆయ‌న చిత్ర యూనిట్‌తో క‌లిసి ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో నాగ‌చైత‌న్య కూడా ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. చైతూ రోల్ ఈ మూవీలో 15 నిమిషాల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఈ మూవీ వాస్త‌వానికి ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు రిలీజ్ కానుంది.

ఇక లాల్ సింగ్ చ‌డ్డా మూవీకి గాను తాజాగా ప‌లువురు తెలుగు సినీ సెల‌బ్రిటీల‌కు అమీర్ ఖాన్ స్పెష‌ల్ షో వేయించారు. ఈ షోకు ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, సుకుమార్‌ల‌తోపాటు చిరంజీవి, చైతూలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే వారు ఈ మూవీని చూస్తున్న ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే దీనిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ట్రోల్స్‌, మీమ్స్ వ‌స్తున్నాయి.

Rajamouli

ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ చాలా గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. రూ.వంద‌ల కోట్లు పెట్టిన తీసిన సినిమాలు అన్నీ అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయి. బాయ్‌కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను సినిమా రిలీజ్ అయిన‌ప్పుడ‌ల్లా అక్క‌డి ప్రేక్ష‌కులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ వ‌ర్గాలు సినిమాలను రిలీజ్ చేయాలంటేనే వ‌ణికిపోతున్నాయి. అయితే ఈ మూవీని ముందుగానే రాజ‌మౌళి, సుకుమార్‌ల‌తోపాటు చిరంజీవి వంటి స్టార్స్‌కు చూపిస్తే వారు ఏమైనా స‌ల‌హాలు ఇస్తే.. చివ‌రి నిమిషంలో సినిమాలో మార్పులు చేయ‌వ‌చ్చు క‌దా.. దీంతో సినిమాకు ఫ్లాప్ టాక్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అలాగే తెలుగు ప్రేక్ష‌కులు ఈ మూవీని చూసేలా వారిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌వ‌చ్చు.. అని అమీర్‌ఖాన్ అనుకున్నారు. అందుక‌నే ఆయ‌న రాజ‌మౌళి, సుకుమార్ ల‌తోపాటు చిరంజీవిని ఆహ్వానించి వారికి ఈ మూవీ స్పెష‌ల్ షోను వేసి చూపించారు.

అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌, జోకులు పేలుతున్నాయి. రాజ‌మౌళికి, చిరంజీవికి సినిమా చూపించారు స‌రే. కానీ రాజ‌మౌళి ఇచ్చే స‌ల‌హాల‌ను పాటిస్తే సినిమా హిట్ అవుతుంది.. కానీ చిరంజీవి ఇచ్చే స‌ల‌హాల‌ను పాటిస్తే మాత్రం అమీర్‌ఖాన్ బుగ్గిపాలు అవుతాడ‌ని.. క‌నుక రాజ‌మౌళి స‌ల‌హాల‌నే పాటించాల‌ని.. నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజన్ల మ‌ధ్య వార్ న‌డుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇప్ప‌టికే అనేక బాలీవుడ్ మూవీలు వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్న నేప‌థ్యంలో అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చ‌డ్డా మూవీ ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM