Naga Chaitanya : థాంక్ యూ మూవీలో 16 ఏళ్ల కుర్రాడిగా క‌నిపించేందుకు నాగ‌చైత‌న్య ఏం చేశాడో తెలుసా ?

Naga Chaitanya : బంగార్రాజు మూవీ స‌క్సెస్ అనంత‌రం నాగ‌చైత‌న్య మ‌న ముందుకు థాంక్ యూ అనే మూవీతో వ‌స్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. రాశి ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు చైతూ ప‌క్క‌న యాక్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చైతూ ఈ మూవీలో అభిరామ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అయితే చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఇటీవ‌లే చైతూ, రాశిఖ‌న్నా మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇక ఇప్పుడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కూడా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆయ‌న ఈ మూవీకి సంబంధించి ప‌లు కీల‌క విష‌యాల‌ను పంచుకున్నారు.

థాంక్ యూ మూవీలో నాగ‌చైత‌న్య మూడు ర‌కాలుగా క‌నిపిస్తాడు. 16 ఏళ్లు, 22 ఏళ్లు, 34 ఏళ్ల వ‌య‌స్సులో ఎలా ఉండాలో అత‌ను అచ్చం అలాగే క‌నిపిస్తాడు. అయితే ఇందుకు ఎలాంటి మేక‌ప్ లేదా గ్రాఫిక్స్‌ను వాడ‌లేదు. మ‌రి అంత త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వాడిలా ఎలా క‌నిపించాడు.. అంటే.. అత‌నే క‌ష్ట‌ప‌డ్డాడు. 50 రోజుల పాటు ప్ర‌త్యేక డైట్‌ను పాటించి బ‌రువు బాగా తగ్గాడు. దీంతో 16 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. సినిమా కోసం చైత‌న్య ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో ఈ ఒక్క సంఘ‌టన చాలు.. అంటూ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ తెలిపారు.

Naga Chaitanya

అలాగే 22, 34 ఏళ్ల వ‌య‌స్సుల‌లో ఉన్న‌వాడిలా క‌నిపించేందుకు కూడా చైతూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నాడ‌ని ద‌ర్శ‌కుడు వివ‌రించారు. క‌నుక సినిమాలో చైతూను మూడు భిన్న ర‌కాల గెట‌ప్‌ల‌లో చూడ‌వ‌చ్చ‌న్నారు. ఇక ఈ మూవీకి బీవీఎస్ ర‌వి ర‌చ‌యిత కాగా ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM