Fish Load : చేప‌ల లోడు ఉన్న ట్ర‌క్కుకు యాక్సిడెంట్‌.. రోడ్డు మీద ప‌డ్డ చేప‌ల‌ను ఏరుకున్న స్థానికులు.. వీడియో..!

May 31, 2022 1:46 PM

Fish Load : భార‌తీయుల‌నే కాదు.. ఏ దేశానికి చెందిన వారు అయినా.. మ‌నిసి స‌హ‌జ స్వ‌భావ‌మే అంత‌. ఫ్రీగా వ‌స్తుంది అంటే.. దాన్ని తీసుకునేందుకు ఎంత వ‌రకైనా వెళ్తారు.. ఏమైనా చేస్తారు. ర‌హ‌దారిపై యాక్సిడెంట్ జ‌రిగితే చూసీ చూడ‌న‌ట్లు వెళ్తుంటారు. ఎవ‌రో మాన‌వ‌త్వం ఉన్న‌వారు మాత్ర‌మే స్పందిస్తారు. స‌గ‌టు మ‌నిషి స్వ‌భావం ఇలాగే ఉంటుంది. ఇది అనేక సార్లు ఇప్ప‌టికే బ‌య‌ట ప‌డింది. ఇక మ‌రోమారు కొంద‌రు త‌మ స‌హ‌జ స్వ‌భావాన్ని చాటుకున్నారు. చేప‌ల లోడుతో వెళ్తున్న ఓ ట్ర‌క్కుకు యాక్సిడెంట్ అయితే రోడ్డుపై ప‌డ్డ చేప‌ల‌ను ఏరుకున్నారు. ఈ సంఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

బీహార్‌లోని గ‌య జిల్లాలో ఉన్న అమాస్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో తాజాగా ఓ యాక్సిడెంట్ జ‌రిగింది. చేప‌ల లోడుతో వెళ్తున్న ఓ ట్ర‌క్కు ప్ర‌మాదానికి గురైంది. దీంతో ట్ర‌క్కులో ఉన్న చేప‌ల‌న్నీ రోడ్డు మీద ప‌డిపోయాయి. అయితే ఇదే అద‌నుగా భావించిన అక్క‌డి స్థానికులు హుటాహుటిన బ‌కెట్లు, గిన్నెలు, పాత్ర‌ల‌ను తెచ్చి రోడ్డు మీద ప‌డ్డ చేప‌ల‌న్నింటినీ ఇళ్ల‌కు త‌ర‌లించారు. కొంద‌రు మ‌హిళ‌లు అయితే చీర‌ల్లో, పురుషులు లుంగీల్లోనూ చేప‌ల‌ను వేసుకుని ఎంచ‌క్కా తీసుకెళ్లారు. కాగా ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Fish Load truck accident local people taken fishes to their homes viral video
Fish Load

రోడ్డుపై ట్ర‌క్కుకు యాక్సిడెంట్ జ‌రిగి అత్య‌వస‌ర స్థితి ఉన్నా స‌రే.. అక్క‌డి స్థానికులు మాత్రం ట్ర‌క్కు నుంచి కింద ప‌డ్డ చేప‌ల‌ను ఏరుకునే ప‌నిలోనే ఉన్నారు.. త‌ప్పితే అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది.. అని తెలుసుకునే స్థితిలో లేరు. గ‌తంలోనూ అనేక చోట్ల ఇలాగే జరిగింది. ఇక తాజాగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏది ఏమైనా.. మ‌నుషుల్లో ఉన్న త‌త్వాన్ని ఈ సంఘ‌ట‌న క‌ళ్ల‌కు చూపిన‌ట్లుగా బ‌య‌ట పెట్టింది. స‌మాజంలో ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఏవిధ‌మైన స్థితిలో ఉన్నారో.. ఈ సంఘ‌ట‌న మ‌న‌కు చాటి చెబుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment