Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత సినిమాలు, సిరీస్‌లలో బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఈమె చేసిన ఐటమ్ సాంగ్ ఈమెకు పాన్ ఇండియా లెవల్‌లో ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే గతంలో అక్కినేని ఫ్యామిలీ పేరుతో సమంతకు అవకాశాలు బాగా వచ్చాయి. అలాగే ఆమె నటనలోనూ తనను తాను రుజువు చేసుకుంది. కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమె లైఫ్ సాఫీగా సాగిపోయింది. కానీ ఇప్పుడు వేరు. అక్కినేని పేరును పూర్తిగా వదిలించుకుంది. తన సొంత కాళ్లపై తాను నిలబడుతోంది. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవడం లేదు. అయితే ఆమె తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. ఈ మూవీ ఏప్రిల్ 28వ తేదీన తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. కణ్మణి రాంబో ఖతీజా పేరిట తెలుగులో దీన్ని విడుదల చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈ మూవీలో సమంత పాత్రకు పెద్దగా అవకాశం లేదని.. ఆమె ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాను తెరకెక్కించిన విగ్నేష్ శివన్.. నయనతార బాయ్ ఫ్రెండ్. ఆమె ఇందులో ఇంకో హీరోయిన్‌గా నటిస్తోంది. కనుక ఆమె పాత్రనే హైలైట్ చేశారని అంటున్నారు. అందువల్ల సమంతకు ఇందులో పెద్దగా ప్రాధాన్యతను కల్పించలేదని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రస్తుతం చేపడుతున్నారు. కానీ సమంతను సైడ్ చేసి నయనతార హైలైట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. కనుక సమంత ఇందులో సెకండ్ హీరోయిన్ అనే విషయం స్పష్టమవుతోంది. అయితే సమంతకు హీరోయిన్ గా అంత మంచి పేరు ఉన్నప్పుడు ఆమె ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎందుకు నటించిందని.. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని.. దీని వల్ల ఆమె ఇమేజ్ దెబ్బ తింటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే అక్కినేని పేరును వదిలించుకుని సొంతంగా ఇండస్ట్రీలో నిలబడాలని ట్రై చేస్తున్న సమంత ఇలా సెకండ్ హీరోయిన్‌గా చేయడం నచ్చడం లేదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా స్టోరీ అయితే తెలియదు. అందువల్ల సినిమాలో సమంత ఇందులో నిజంగానే సెకండ్ హీరోయినా.. అన్న విషయంపై ఇప్పటికప్పుడు క్లారిటీ అయితే రాదు. సినిమా విడుదల అయితేనే దీనిపై స్పష్టత వస్తుంది. మరి ఫ్యాన్స్ అన్నట్లు ఈ మూవీలో సమంత నిజంగానే సెకండ్ హీరోయినా.. ఆమెకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదా.. అన్న విషయం నిజమవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…