KGF Stars Remuneration : కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ 2018లో విడుదలై సంచలనాలను సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవడమే కాకుండా.. రికార్డులను బద్దలుకొట్టింది. భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి కన్నడ సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఇప్పుడు అవే అంచనాలతో మళ్లీ కేజీఎఫ్ చాప్టర్ 2 ను రిలీజ్ చేశారు. గురువారం ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10వేల స్క్రీన్‌లలో రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో.. థియేటర్లకు వారు క్యూ కడుతున్నారు. ఇక సినిమాకు చెందిన టాక్ పాజిటివ్‌గానే వస్తోంది. దీంతో యష్ ఇంకో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు.
అయితే కేజీఎఫ్ చాప్టర్ 2కు చెందిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఈ మూవీ కోసం హీరో యష్‌తోపాటు ఇతర నటీనటులు, సిబ్బంది ఎంత రెమ్యునరేషన్‌ను తీసుకుని ఉంటారు ? అని ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
కేజీఎఫ్ లో రాకీగా అలరించిన యష్ ఈ సినిమాకు రూ.27 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సంజయ్ దత్ ఇందులో అధీరా పాత్రలో కనిపించారు. ఇందుకు ఈయన రూ.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే భారత ప్రధాని పాత్రలో నటించిన రవీనా టాండన్ రూ.2 కోట్లు తీసుకుందని తెలుస్తోంది.
ఇక చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ రూ.20 కోట్ల మొత్తం అందుకున్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీనిధి రూ.4 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.82 లక్షలు, చాప్టర్ 1 నటుడు అనంత్ నాగ్ రూ.50 లక్షలు, మాళవిక అవినాష్ రూ.60 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక కేజీఎఫ్ 2 మూవీకి ఎక్కడ చూసినా ప్రేక్షకుల నుంచి భారీగానే స్పందన వస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా కేజీఎఫ్ 1 మాదిరిగానే చాప్టర్ 2ను కూడా ఆదరిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…