Actress Pragathi : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందులో హీరోయిన్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వారు ఎప్పటికప్పుడు తమ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తున్నారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక వీళ్లను చూసి బుల్లితెర నటులు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించేవారు కూడా సామాజిక మాధ్యమాల్లో సందడి చేయడం మొదలు పెట్టారు. వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఒకరు. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను తన ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో అవి నెటిజన్లను అలరిస్తుంటాయి.
ఇక తాజాగా ప్రగతి జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండడం విశేషం. ఈ మధ్యే హోలీ పండుగ సందర్భంగా కూడా ప్రగతి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోలీ ఆడి ఆ వీడియోలను షేర్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
కాగా ప్రగతి ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉంది. ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫిట్ నెస్ విషయంలోనూ ఈమె చాలా సీరియస్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈమెకు 44 ఏళ్లు. అయినప్పటికీ అలా ఈమె కనిపించదు. అందుకు ఈమె జిమ్ లో చేసే వర్కవుట్లే కారణమని చెప్పవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…