Facebook : ఫేస్‌బుక్ సేవ‌లు ఆగినందుకు జుక‌ర్‌బ‌ర్గ్‌కు షాక్‌.. భారీ ఎత్తున సంప‌ద న‌ష్టం..

October 5, 2021 8:04 AM

Facebook : సోమ‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం 3 గంట‌ల వ‌ర‌కు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప‌నిచేయ‌లేదు. ఈ నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన సేవ‌లు నిలిచిపోయాయి. దీంతో యూజర్ల‌కు ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది త‌మ ఇంట‌ర్నెట్ ప‌నిచేయ‌డం లేదు కావ‌చ్చ‌ని అనుకున్నారు. కానీ అస‌లు విష‌యం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

Facebook : ఫేస్‌బుక్ సేవ‌లు ఆగినందుకు జుక‌ర్‌బ‌ర్గ్‌కు షాక్‌.. భారీ ఎత్తున సంప‌ద న‌ష్టం..

అయితే రోజూ చాలా మంది ఈ మూడు నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన సేవ‌ల‌ను విస్తృతంగా ఉప‌యోగిస్తుంటారు. మీడియా కూడా ఎక్కువ‌గా వీటిని వాడుతుంది. అందులోనూ రాత్రి స‌మ‌యం క‌నుక వీటి సేవ‌లు ఆగిపోవ‌డంతో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. మ‌ళ్లీ ఎప్పుడు అవి ప‌నిచేస్తాయోన‌ని ఆందోళ‌న చెందారు. అయితే ఎట్ట‌కేల‌కు సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించారు.

ఇక 6 గంట‌ల పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవ‌లు నిలిచిపోయినందున ఫేస్‌బుక్‌కు దాదాపుగా 600 కోట్ల డాల‌ర్ల మేర న‌ష్టం జ‌రిగింది. ఇక ఫేస్‌బుక్ స్టాక్ 4.9 శాతం త‌గ్గింది. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వ్య‌క్తిగ‌త సంప‌ద 6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ప‌డిపోయింది. స్టాక్ స్ల‌యిడ్ లో జుక‌ర్ బ‌ర్గ్ ఆస్తి విలువ 121.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌డిపోగా.. ఆయ‌న సంప‌న్నుల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now