F3 : వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ.. ఎఫ్3. ఎఫ్2కు సీక్వెల్ కాకపోయినా నటీనటులు అందరూ వాళ్లే ఇందులోనూ యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దీంతో త్వరలోనే మళ్లీ ఎఫ్4ను ప్రారంభిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే స్టార్ నటులను ఈసారి రంగంలోకి దింపుతానని అన్నారు.
కాగా ఎఫ్3 మూవీని సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మరో ఓటీటీ సంస్థ కూడా ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. 22వ తేదీనే ఈ మూవీ సోనీ లివ్‌తోపాటు నెట్ ఫ్లిక్స్‌లోనూ రిలీజ్ కానుంది. ఈమేరకు నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది.
కాగా ఎఫ్3 మూవీలో తమన్నా, మెహ్రీన్‌లు ఫీమేల్ లీడ్స్‌లో నటించారు. పూజా హెగ్డె ఒక ప్రత్యేక సాంగ్‌లో కనిపించి అలరించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. థియేటర్లలో రిలీజ్ అయి భారీ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…