F3 : ఎఫ్‌3 మూవీ ఓటీటీలో వ‌చ్చేస్తోంది.. డేట్ నోట్ చేసి పెట్టుకోండి..!

July 13, 2022 7:46 AM

F3 : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ మ‌ల్టీ స్టార‌ర్‌గా ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన మూవీ.. ఎఫ్3. ఎఫ్‌2కు సీక్వెల్ కాక‌పోయినా న‌టీన‌టులు అంద‌రూ వాళ్లే ఇందులోనూ యాక్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఎఫ్‌4ను ప్రారంభిస్తాన‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే స్టార్ న‌టుల‌ను ఈసారి రంగంలోకి దింపుతాన‌ని అన్నారు.

కాగా ఎఫ్‌3 మూవీని సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే మ‌రో ఓటీటీ సంస్థ కూడా ఈ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. 22వ తేదీనే ఈ మూవీ సోనీ లివ్‌తోపాటు నెట్ ఫ్లిక్స్‌లోనూ రిలీజ్ కానుంది. ఈమేర‌కు నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

F3 movie to stream on Netflix also on July 22nd
F3

కాగా ఎఫ్‌3 మూవీలో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఫీమేల్ లీడ్స్‌లో న‌టించారు. పూజా హెగ్డె ఒక ప్ర‌త్యేక సాంగ్‌లో క‌నిపించి అల‌రించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయి భారీ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.

F3

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now