Evaru Meelo Koteeswarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి గుడ్ బై చెప్ప‌నున్న ఎన్టీఆర్..!

October 23, 2021 8:26 PM

Evaru Meelo Koteeswarulu : వెండితెర‌పై ర‌చ్చ చేస్తున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై ఆకట్టుకోలేక‌పోతున్నాడు. బిగ్ బాస్ తొలి సీజ‌న్‌లో అద‌ర‌గొట్టిన ఎన్టీఆర్ రెండో సీజ‌న్‌కి బైబై చెప్పాడు. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో రీఎంట్రీ ఇచ్చాడు జూనియ‌ర్. ఈ షోలో ఎన్టీఆర్ త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేసుకుంటున్న‌ప్ప‌టికీ షో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతోంది.

Evaru Meelo Koteeswarulu ntr to say good bye to show

మా టీవీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత జీ, ఈటీవీ ఉన్నాయి. జెమిని 4 వ స్థానంలో ఉంది. దాని రేటింగ్‌లను మెరుగుపరచాలనే లక్ష్యంతో మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే రెండు కార్యక్రమాలు విఫలమయ్యాయి.

రెండు మూడు వారాలకు రేటింగ్స్ బాగానే ఉన్నా.. రాను రాను ఈ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి. బిగ్‌బాస్ షో రేటింగ్స్‌తో అదరగొట్టిన తారక్.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రామ్‌తో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. దీపావళి రోజున మహేష్ బాబు హాజరు కానున్నారు.

అయితే ఇక ముందు ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించలేకపోవచ్చనే టాక్ వినబడుతోంది. షో పెద్ద‌గా ఆశాజ‌న‌కంగా లేని కార‌ణంగా ఎన్టీఆర్ షోకు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఆయ‌న నో చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now