Esther Anil : దృశ్యం పాప ఎస్తెర్ అనిల్‌ ఏమాత్రం తగ్గడం లేదుగా.. మళ్లీ ఫొటోషూట్‌..!

January 29, 2022 12:20 PM

Esther Anil : దృశ్యం సినిమాలో వెంకటేష్‌ చిన్న కుమార్తె పాత్రలో నటించిన ఎస్తెర్‌ అనిల్‌ ప్రస్తుతం గ్లామర్‌ ఫొటోషూట్స్‌ చేస్తూ అందరి దృష్టిలోనూ పడే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫొటోలు దిగుతోంది. ఈమె బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ముద్రను చెరిపి వేస్తూ గ్లామర్‌ క్వీన్‌గా మారాలని చూస్తోంది.

Esther Anil latest golden color dress photoshoot

ఈ మధ్య కాలంలో ఎస్తెర్‌ అనిల్‌ స్పీడ్‌ పెంచిందనే చెప్పవచ్చు. వరుస ఫొటోషూట్స్‌తో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈమె అందాలను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దృశ్యం సినిమాలో చేసింది ఈమెనేనా.. అని ఆశ్చర్యపోతున్నారు.

ఎస్తెర్‌ అనిల్‌ ఇప్పటికే ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించింది. ఆహాలో వచ్చిన ఓటీటీ సినిమాల్లో కనిపించింది. పెద్ద సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి ఈమె బ్యూటీని చూసి అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now