Drumstick Leaves : మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క. ఇది ఆసియా , ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. మనం నిత్యం మునగకాయను మాత్రమే వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ శతాబ్దాలుగా ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, మూలాలను ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. తోటకూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల కంటే మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మునగాకుని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వలన మధుమేహం, బాక్టీరియల్, వైరల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పి, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, అధిక రక్త పోటు, ఔషధాల వల్ల కాలేయం దెబ్బతినడం, కడుపు పూతలు, ఆస్తమా, పేద్దప్రేగు కాన్సర్, అతిసారం వంటి అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
మునగాకులల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి , అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. అదేవిదంగా పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్స్ కంటే 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది. కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమైనో యాసిడ్‌లను కలిగి ఉండటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలుతో పాటు శరీర పెరుగుదలకు సహాయపడే కండరాలను కూడా దృఢంగా తయారు చేస్తోంది.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మహిళాలలో థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పుష్కలంగా పెరుగుతాయి.
గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు పాటు కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి సేవిస్తే ఆస్థమా, టీబీ, దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి. ఇక మునగాకు మగవారిలో సంతాన సమృద్ధిని పెంచే పోషక విలువలు అధికంగా ఉండటం వలన లైంగిక సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు మునగాకును జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…