Drumstick Leaves : మున‌గాకుతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? త‌ప్ప‌క తీసుకోవాల్సిందే..!

October 11, 2022 9:36 PM

Drumstick Leaves : మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క. ఇది ఆసియా , ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. మనం నిత్యం మునగకాయను మాత్రమే వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ శతాబ్దాలుగా ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, మూలాలను ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. తోటకూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల కంటే మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మునగాకుని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వలన  మధుమేహం, బాక్టీరియల్, వైరల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పి, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, అధిక రక్త పోటు, ఔషధాల వల్ల కాలేయం దెబ్బతినడం, కడుపు పూతలు, ఆస్తమా, పేద్దప్రేగు కాన్సర్, అతిసారం వంటి అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

మునగాకులల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి , అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. అదేవిదంగా పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్స్ కంటే 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది.  కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమైనో యాసిడ్‌లను కలిగి ఉండటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలుతో పాటు శరీర పెరుగుదలకు సహాయపడే కండరాలను కూడా దృఢంగా తయారు చేస్తోంది.

Drumstick Leaves amazing health benefits
Drumstick Leaves

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మహిళాలలో థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పుష్కలంగా పెరుగుతాయి.

గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు పాటు కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి సేవిస్తే ఆస్థమా, టీబీ, దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి. ఇక మునగాకు మగవారిలో సంతాన సమృద్ధిని పెంచే పోషక విలువలు అధికంగా ఉండటం వలన లైంగిక సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు మునగాకును జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment