Kajal Aggarwal : కాజ‌ల్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.. చందమామ బాగానే వెనకేసుకుందిగా..!

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ ఇపుడు వరుసగా సినిమాలు చేయడానికీ ఓకే చెబుతోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హీరోగా వ‌స్తోన్న ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్లో కాజ‌ల్ పాల్గొంటోంది. ప‌దేళ్ల పాటు తెలుగులో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేయ‌డంతో పాటు త‌మిళ్‌, బాలీవుడ్‌లోనూ న‌టించిన కాజ‌ల్ బాగానే ఆస్తులు కూడబెట్టుకుంది. ఇక కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ల‌తో ఏకంగా రూ. 100 కోట్ల‌కు పైగా ఆస్తులు సంపాదించింది. అయితే ఆమె కొన్న స్థిరాస్తుల విలువ ఇప్పుడు భారీగా పెర‌గ‌డంతో ఆమె మొత్తం ఆదాయం చాలా ఎక్కువ‌గానే ఉండ‌నుంది.

Kajal Aggarwal

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుతో పాటు ముంబైలోనూ ఆమెకు ప్లాట్లు, ఖ‌రీదైన ల‌గ్జ‌రీ ఇళ్లు ఉన్నాయి. ఓ నేష‌న‌ల్ మీడియా వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం ఆమె వార్షికాదాయం రు. 6 కోట్లపై మాటే అట‌. ఓవ‌రాల్‌గా ఆమె చ‌రాస్తులే రు. 100 కోట్లు ఉంటాయ‌ని.. స్థిరాస్తులు కూడా క‌లుపుకుంటే కాజ‌ల్ ఆస్తులు డ‌బుల్ ఉంటాయ‌ని టాక్! ఆమె ఖ‌రీదైన కార్లు వాడుతుంది. ఆమె వాడే కార్ల విలువే రు. 5 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. కాజ‌ల్ త‌న సంపాద‌న‌ను అనేక వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. ఇక ఆమె భ‌ర్త గౌత‌మ్ కిచ్లు కూడా ఇంటీరియ‌ర్ డిజైనింగ్ బిజినెస్‌తో బాగానే సంపాదిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM