Dates and Almond Benefits : ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఖర్జూరం అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారలలో ఒకటి. శరీరానికి కావలిసిన శక్తినివ్వటానికి, శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం శరీరానికి అందిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ ఎ ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు.
ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పేస్ట్ లా చేసి పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఖర్జూరాల్లోని మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మహిళలు గర్భధారణ సమయంలో ఖర్జూరాలను తీసుకుంటే ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
అంతేకాకుండా ఖర్జూరాలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో ఉండే బోరాన్ అనే సమ్మేళనంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీనివల్ల ఎముకలు గుల్లగా మారిపోయే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఖర్జూరాలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. రోజుకి రెండు ఖర్జూరాలను తినడం ద్వారా ఒత్తిడి, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
ఖర్జూర పండ్లలోని పొటాషియం గుండెకు రక్తాన్ని సక్రమంగా అందేలా చేస్తుంది. రక్తపోటులో హెచ్చు తగ్గులను నియంత్రించేందుకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాల్లోని ఐరన్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచి రక్తహీనతను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూకు రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించడంతో పాటు బలం చేకూరుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…