NTR : విశ్వ విఖ్యాత నటనా సార్వభౌమ.. ఈ బిరుదు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే పేరు.. ఎన్‌టీఆర్. నందమూరి తారక రామారావు సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన చేయని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు. ఆయన తెలుగు సినిమాకు వన్నె తెచ్చారు. ఇక కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు. దీంతో ప్రజాకర్షక పాలన చేశారు. అయితే ఎన్‌టీఆర్ పేరునే హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెట్టుకున్నారు. ఆ పేరును ఆయన తాతనే స్వయంగా ఆయనకు పెట్టారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్‌టీఆర్ హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు. 1983 మే 20న జూనియర్ ఎన్‌టీఆర్ జన్మించారు. అయితే ఎన్టీఆర్ తన కుమారులకు కృష్ణ అనే పేరు చివర్లో వచ్చేలా పెట్టారు. కానీ హరికృష్ణ మాత్రం తన కొడుకులకు రామ్ అని చివర్లో వచ్చేలా పెట్టారు. రాముడు అంటే ఇష్టమని కనుకనే అలా పేరు పెట్టానని తెలిపారు. ఇక జూనియర్ ఎన్‌టీఆర్‌కు తారక రామ్ అని మొదట్లో పేరు పెట్టారు. ఈ క్రమంలోనే ఒకసారి హరికృష్ణ తన కుమారున్ని తీసుకుని ఎన్‌టీఆర్ వద్దకు వెళ్లారు.
అప్పుడు ఎన్‌టీఆర్.. తారక్‌ను నీ పేరు ఏంటి బాబు.. అని అడగ్గా.. తారక రామ్ అని సమాధానం చెప్పాడు. దీంతో ఎన్‌టీఆర్ ఆశ్చర్యపోయారు. తన పేరును కొడుక్కి ఎందుకు పెట్టావని హరికృష్ణను అడిగారు. అయితే కృష్ణ అని పెట్టడం ఇష్టం లేక రామ్ అనే పేరు పెట్టానని.. అలాగే ఎన్‌టీఆర్ అనే తన తండ్రి పేరు కలిసేలా తారక్ అని ముందు పెట్టానని హరికృష్ణ తెలిపారు. దీంతో తారక్ రామ్ అయింది. అయితే కాసేపటి తరువాత సీనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి తారక్‌తో మాట్లాడుతూ.. నువ్వు నా అంశలో జన్మించావు.. కనుక నీ పేరు తారక రామారావు అని పిలవాలి. నువ్వు కూడా నాలాగే గొప్పవాడివి అవుతావు.. అని సీనియర్ ఎన్‌టీఆర్ తారక్‌ను ఆశీర్వదించారు. ఇలా తారక్ రామ్ కాస్తా తారక రామారావు అయింది. అప్పటి నుంచి తారక్ ఎన్‌టీఆర్‌గా కొనసాగుతున్నారు. అందుకనే ఆయనను ఇప్పటికీ తారక్ అని పిలుస్తుంటారు. ఇదీ.. తారక్‌కు ఎన్‌టీఆర్ పేరు పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…