KGF : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఏంటో.. దాని స్టామీనా ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు నార్త్‌లో హిందీ సినిమాల రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్.. ఇటీవల కెజియఫ్ 2 మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీలో హీరోగా నటించిన యష్ కి ఎంత పెద్ద గుర్తింపు వచ్చిందో అందరికీ తెలుసు. హీరో పాత్రలో యష్ కాకుండా మరెవరైనా చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ ఈ సినిమాలో మొదట వేరే స్టార్ హీరోని అనుకున్నారట. ప్రశాంత్ నీల్ ఈ కథ అనుకున్నప్పుడు ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తే బాగుంటుంది అనుకొని హృతిక్ రోషన్ ని కలవడానికి చాలా ప్రయత్నించారట. కానీ హృతిక్ రోషన్ అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు.
దీంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో పాన్ ఇండియన్ లెవెల్ లో చెప్పాలని నిర్ణయించుకున్నారు ప్రశాంత్ నీల్. అందుకే కన్నడ హీరోతోనే ఎలాగైనా సరే ఈ సినిమా చేద్దామని అనుకున్నారు. ప్రశాంత్ నీల్ అనుకున్నట్టే యష్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తర్వాత యష్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనుకున్నట్టు శాండల్ వుడ్ పేరు బాలీవుడ్ కే కాదు హాలీవుడ్ కి కూడా పరిచయం చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…